తొలి శుభోదయం ప్రకాశం:-
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించబడింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీస్ అధికారులు అన్ని ముఖ్య ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు.ఈ క్రమంలో ఒంగోలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ, జిల్లా బాంబ్ డిస్పోజల్ టీమ్, జీఆర్‌పీ మరియు ఆర్‌పీఎఫ్ సిబ్బందితో కలిసి ఒంగోలు ఆర్‌టీసీ బస్టాండ్‌లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.పార్సిల్ ఆఫీసులు, లగేజ్ కౌంటర్లు, మరియు రెండు చక్రాల పార్కింగ్ ప్రాంతాల్లో అనుమానాస్పద వస్తువులు, ప్యాకేజీలను పరిశీలించారు.బస్టాండ్ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.“ఏదైనా అనుమానాస్పద వ్యక్తి లేదా వస్తువు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ప్రజల సహకారంతోనే నేరాలను నిరోధించవచ్చు” అని తెలిపారు.
ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజల భద్రత కోసం నిరంతరం కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్నారు.