తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-

మార్కాపురం జిల్లా గిద్దలూరు లో ఆదివారం రెండవ అదనపు జూనియర్ సివిల్ న్యాయస్థానాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. కార్యక్రమానికి కలెక్టర్ విజయ సునీతతో పాటు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు , జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజ్యలక్ష్మి కార్యక్రమానికి హాజరయ్యారు. 2వ జూనియర్ సివిల్ న్యాయస్థానానికి జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అయినా భరత్ చంద్ర అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గా భరత్ చంద్ర వ్యవహరిస్తున్నారు. కార్యక్రమం అనంతరం న్యాయవాదులు భరత్ చంద్రకు శుభాకాంక్షలు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *