తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-

తర్లుపాడు మండలం కలజువ్వలపాడు లోని జవహర్ నవోదయ కేంద్రీయ విద్యాలయంలో మంగళవారం జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవో, మున్సిపల్, ఏఎస్ వో లకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమం లో మొదటిరోజు పాల్గొని తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ త్వరితగతిన ఈ జనాభా లెక్కల సేకరణ పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని అధికారులు అందరూ వారికి కేటాయించిన విధులను సమగ్రంగా నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు. సెన్సెస్ విభాగం అడిషనల్ డైరెక్టర్ ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ జనాభా లెక్కల సేకరణ డిజిటల్ విధానంలో చేపడుతున్నట్లు వివరించారు. మొదటి విడతలో ఇళ్ల గనణ, రెండో విడతలో జనాభా లెక్కల తో పాటు కుల గణన చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజలే తమ వివరాలను స్వయంగా ఇంటి వద్ద నుంచే నమోదు చేసుకునేలా ప్రత్యేక పోర్టల్ తీసుకొచ్చామని తెలిపారు. ఇక్కడ మూడు రోజులు శిక్షణ పొందిన వారు మండల స్థాయిలో సిబ్బందికి దీనిపై అవగాహన కల్పించాల్సి ఉంటుందన్నారు. మార్కాపురం జిల్లాలో మొత్తం 497 గ్రామాల్లో ఈ జనాభా సేకరణ లెక్కలు చేపట్టి విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మే నెల 1నుంచి 30 వ తేది వరకు మొదటి మొదటి విడత కార్యక్రమాన్ని సమగ్రంగా చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బిసీహెచ్. ఓబులేసు, మార్కాపురం ఆర్డీవో పి.ప్రభాకర్, కనిగిరి ఆర్డిఓ ఎం. శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు….

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *