తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజల రోడ్డు భద్రతను మరింత మెరుగుపరచే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ట్రాఫిక్ పోలీస్ శాఖ, MM రోడ్ జంక్షన్ ఫ్లైఓవర్ పాయింట్ వద్ద స్టాపర్ బోర్డులను సమానంగా ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ RSI శివ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఫ్లైఓవర్ వద్ద వాహనాల నియంత్రణ, ప్రమాదాల నివారణ మరియు ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ఈ స్టాపర్ బోర్డులు ఉపయోగపడతాయని పోలీసులు తెలిపారు.రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఇలాంటి ముందస్తు భద్రతా చర్యలు కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసులు పేర్కొన్నారు.