తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రజల శాంతి భద్రతలు, సామాజిక క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, జిల్లా వ్యాప్తంగా ఓపెన్ బూజింగ్ ప్రదేశాల శుభ్రత కార్యక్రమాలు నిర్వహించబడినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా కందుకూరు పట్టణ పీఎస్, వీ.వి.పాలెం పీఎస్ పరిధులతో పాటు కోతపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా బహిరంగంగా మద్యం సేవించే ప్రదేశాలను గుర్తించి శుభ్రపరిచారు. కోతపట్నం పరిధిలో ఈ కార్యక్రమాన్ని పంచాయతీ కార్మికులు మరియు బహిరంగంగా మద్యం సేవించే వ్యక్తుల సహకారంతో నిర్వహించడం విశేషం.ఈ శుభ్రత చర్యలను కందుకూరు టౌన్ పీఎస్ ఎస్ఐ, వీ.వి.పాలెం పీఎస్ ఎస్ఐ, అలాగే కోతపట్నం పీఎస్ ఎస్ఐ పర్యవేక్షణలో సమర్థవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ మద్యం సేవ వల్ల కలిగే సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజల భాగస్వామ్యంతో సమాజాన్ని క్రమబద్ధంగా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ఓపెన్ బూజింగ్, అసాంఘిక కార్యకలాపాల నివారణకు ఇలాంటి ప్రత్యేక డ్రైవ్లు నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమ పరిసరాల్లో ఇటువంటి ఘటనలు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 112 కు సమాచారం అందించాలని కోరారు.