తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
దర్శి పట్టణం చౌటపాలెం రోడ్లో ఏర్పాటు చేసిన MNR ఎంటర్ప్రైజెస్ & ఫైర్ వర్క్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు గారు, దర్శి తహసీల్దార్ ఎం. శ్రవణ్ కుమార్ , దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య , దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు , దర్శి టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్నా మరియు స్థానిక నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.