తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు :-
గుడ్లూరు మండలంలోని పొట్లూరు పంచాయతీ నందు ఉలవపాడు ప్రాజెక్టు సిడిపిఓ మాధవి లత ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ మార్చి 8 మిషన్ శక్తి 20 రోజుల కార్యక్రమం లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కామేశ్వరి మాట్లాడుతూ ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (Pmmvy) ప్రయోజనాలను వివరించడం జరిగింది. మహిళలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత గర్భం దాల్చిన గర్భవతికి ఈ పథకం వర్తిస్తుందని. మొదటి కాన్పు నమోదు చేసుకున్న వారికి ఏ బిడ్డ అయినా ప్రభుత్వం 5000 రూపాయలు ఇస్తుందని. వారి పేరు నమోదు చేసి టీ ఇంజక్షన్లు అయినా వెంటనే 3000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంద. ప్రసవించిన బిడ్డకు ఇమ్యునైజేషన్ పూర్తయిన వెంటనే 2000 రూపాయలు ఇస్తుందని తెలిపారు. తర్వాత రెండవ కాన్పులో ఆడబిడ్డ పుడితే ఆ బిడ్డకు ఇమ్యూనైజేషన్ పూర్తయిన వెంటనే పేరు నమోదు చేసుకున్న వారికి ఒకేసారి ఆరువేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అక్కడికి వచ్చిన గర్భవతులకు బాలింతలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కామేశ్వరి. అంగన్వాడీ టీచర్లు సిహెచ్. రమాదేవి ఎస్.కె.అమీర్ నిషా. గర్భవతులు బాలింతలు పాల్గొన్నారు