తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు గిద్దలూరు మండలం అక్కిరెడ్డిపల్లి గ్రామ శివారులో అక్రమంగా జూదం (పేకాట) నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ తనిఖీల్లో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 13,200/- నగదును మరియు జూదానికి సంబంధించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *