తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

అక్రమ జూద కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గుడ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని యేలూరిపాడు పొలాల్లో ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి సంయుక్త దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న 6 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ. 29,410 నగదు, 7 మొబైల్ ఫోన్లు మరియు 3 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.అలాగే వెలిగండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగుళ్ళూరు గ్రామంలో విశ్వసనీయ సమాచారం మేరకు మరో దాడి నిర్వహించి, జూదంలో పాల్గొంటున్న 9 మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ. 10,560 నగదు, 8 మొబైల్ ఫోన్లు మరియు 5 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అక్రమ జూదంపై పోలీసులు నిరంతరం ప్రత్యేక దాడులు నిర్వహిస్తూ, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఇటువంటి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *