తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

చేయి చేయి కలుపుదాం పేదవారి అవసరాలను తీర్చుదాం అనే నినాదంతో.శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరు వారి ఆధ్వర్యంలో సోమవారం శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, నెలవారీ దాతలు,ఈరోజు దాతలు సహాకారంతో కందుకూరు పట్టణ వీధుల్లోని నిరాశ్రుయులకు,యాచకులకు పేదలకు ఈ వేసవి కాలం సందర్భంగా గొడుగులు,చెప్పులు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా కందుకూరు కృష్ణాలయం జాయింట్ సెక్రెటరీ నల్లమల్లి ప్రసాద్ రావు మాట్లాడుతూ రవ్వా శ్రీనివాసులు గారు,వృత్తి వ్యాపారాల్లో బిజీగా ఉండి కూడా నిస్వార్థముతో సేవ చేయాలనే ఉద్దేశంతో ఎంతో సమయాన్ని కేటాయించి పేదవారికి అవసరమైన వివిధ రకాల సేవలను అందిస్తున్నారని, సొసైటీ సేవా కార్యక్రమాల్లో మేము కూడా స్వయంగా పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.మరియు ఈ వేసవి కాలం అక్షయ తృతీయ సందర్భంగా పేదలకు గొడుగులు, చెప్పులు,పంపిణీ చేయడం ఎంతో మంచి పుణ్య కార్యక్రమం అని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు సేవారత్న రవ్వా శ్రీనివాసులు(ఎల్. ఐ.సి & స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్),ఈ.సి.మెంబర్లు తాతా వెంకట నాగకార్తీక్ (బాంబే హాల్), కోట వెంకటేశ్వర్లు,మోదడుగు శ్రీనివాసరావు,సభ్యులు చక్కా చైతన్య గుప్తా(రుచ్ ప్యాషన్స్),సమీర్ గార్లు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *