తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

మహిళలు మరియు విద్యార్థినుల భద్రతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో, ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీస్ యంత్రాంగం సంయుక్తంగా శక్తి యాప్ (Shakti App) పై భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది విద్యా సంస్థలు, కార్యాలయాలు మరియు రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలను సందర్శించి యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు.ముఖ్యంగా, ఆపద సమయంలో ఉన్నప్పుడు యాప్‌లోని SOS బటన్‌ను నొక్కితే, ఆ సమాచారం క్షణాల్లో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఎలా చేరుతుందో ప్రాక్టికల్‌గా వివరించారు. దీనివల్ల బాధితులు ఉన్న ప్రాంతాన్ని (Location) పోలీసులు సులభంగా గుర్తించి, వేగంగా సహాయం అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి మహిళా తమ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని రక్షణ కవచంగా మార్చుకోవాలని పోలీసులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *