తొలి శుభోదయం న్యూస్ అద్దంకి పోలీస్ :-

ఈ కార్యక్రమంలో మహిళలు మరియు పిల్లలపై జరిగే వివిధ రకాల నేరాలు, వాటి నివారణ చర్యలు, చట్టపరమైన రక్షణలు గురించి పాల్గొనేవారికి వివరించారు. వ్యక్తిగత భద్రత, సైబర్ భద్రత, అలాగే అప్రమత్తంగా ఉండడం ద్వారా నేరాలను ఎలా నివారించవచ్చో అవగాహన కల్పించారు.అలాగే, ఎలాంటి అనుమానాస్పద సంఘటనలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, మహిళలు మరియు పిల్లల రక్షణలో సమాజం పాత్ర ఎంతో ముఖ్యమని పోలీసులు తెలిపారు. అత్యవసర సమయాల్లో ఉపయోగపడే హెల్ప్‌లైన్ నంబర్ల గురించి కూడా వివరించారు.కార్యక్రమం ముగింపులో, అందరూ అప్రమత్తంగా ఉండి ఈ అవగాహనను ఇతరులకు పంచుతూ మహిళలు మరియు పిల్లలకు సురక్షితమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *