తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
భారతీయ జనతా పార్టీ ఆర్ టి సి జోనల్ ఛైర్మన్ మార్కాపురం జిల్లా మార్కాపురం ఆర్ టి సి బస్టాండ్ కు సన్నారెడ్డి సురేష్ రెడ్డి ఆర్ టి సి కార్మికుల సన్మాన కార్యక్రమ పర్యటన లో మార్కాపురం అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ ఇంచార్జీ పి వి కృష్ణా రావు, గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు భవనాషి వెంకట రామాంజనేయులు,దప్పిలి వినోద్ కుమార్ రెడ్డి, లాయర్ శ్రీనివాస రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ టి సి జోనల్ ఛైర్మన్ సన్నా రెడ్డి సురేష్ రెడ్డి మాట్లాడుతూ మార్కాపురం ఆర్ టి సి బస్టాండ్ అభివృధి కార్య క్రమాల గురించి చర్చించడం తో పాటు జిల్లా లో ఆర్ టి సి ప్రయాణికులకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని తెలియ చేయడం జరిగింది.