తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పి.యస్., ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలసి జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. పరీక్ష వ్రాసే విద్యార్థులు ఎలాంటి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాలలోనికి తీసుకెళ్లకుండా క్షణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తూ, పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో పరీక్షలు జరిగే సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేసే విధంగా చర్యలు తీసుకున్నారు. పరీక్షా సమయంలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూస్తున్నారు. పరీక్ష పూర్తయ్యేవరకు సిబ్బంది అందరు అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తూ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా జరగడానికి పోలీస్ శాఖ తరఫు నుండి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏ పరీక్షా కేంద్రం వద్దయినా ఎటువంటి చిన్న ఘటన జరిగిన వెంటనే డయల్ 112/100 లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ 9121102266 కు సమాచారం అందించాలన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *