తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరు పట్టణంలోని జామియా మసీదులో మంగళవారం రాత్రి జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. పేష్ మామ్ బ్రదర్స్ మరియు జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో విందు ఏర్పాటు చేయగా… ముస్లిం సోదరులతోపాటు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా మసీదుకు విచ్చేసిన ఎమ్మెల్యే నాగేశ్వరరావుకు కమిటీ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ప్రత్యేక ప్రార్థన (దువా) అనంతరం ముస్లిం కుటుంబాలకు ఎమ్మెల్యే గారు ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపవాసాన్ని విరమింపచేస్తూ ఖర్జూరాలు తినిపించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పట్టణ మాజీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ సలాం, 6వ వార్డు టిడిపి అధ్యక్షుడు నాయబ్ రసూల్, పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు అహ్మద్ బాషా, విందు నిర్వాహకులు పేష్ మామ్ బ్రదర్స్ సయ్యద్ ముస్తాక్, సయ్యద్ నసీర్, ఖాదర్ వలీ, ఆరిఫ్, మొయిద్, జహీర్, అక్బర్, మసూద్, షేక్ మున్నా, రూబీ ఫిరోజ్, జియా, గౌస్ బాషా, ఖలీల్ , కుద్దూస్, ఖాదర్ వలీ, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, ఏపీఈడబ్ల్యూఐడి కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి బెజవాడ ప్రసాద్, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, నియోజవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అల్లం వెంకటేశ్వర్లు, నియోజవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు ముచ్చు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *