తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ప్రచురించిన ప్రత్యేక క్యాలెండర్లను ప్రకాశం జిల్లా విద్యా శాఖాధికారి సి వి రేణుక బుధవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్యాలెండర్ ద్వారా ప్రసిద్ధ ఉర్దూ రచయితలు, కవులను పరిచయం చేయడమే కాకుండా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు వర్ణ చిత్రాల ద్వారా ప్రజానీకానికి పరిచయం చేయడం బాగుందన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ సరికొత్త తీరుతెన్నులతో ఇటు ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేయడం మాత్రమే కాకుండా ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుల మీద ప్రచురితమైన తెలుగు భాషలోని గ్రంథాలను ఉర్దూ భాషలోకి అనువదించడం శుభపరిణామం అన్నారు. అలాగే ఆ గ్రంథాలను ప్రచురించేందుకు అడుగులు వేయడం ఆహ్వానించదగిన నిర్ణయమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక సేవకులు ఎం.ఏ.సాలార్, ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా, షేక్ రహంతుల్లా, జర్నలిస్ట్ షేక్ నాసిర్ తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *