తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న 58 మందికి, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిధులు మంజూరు కాగా…. సంబంధిత చెక్కులను కందుకూరులోని టిడిపి కార్యాలయంలో గౌరవ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు శుక్రవారం అందజేశారు. వలేటివారిపాలెం మండలంలో 16మందికి – 8లక్షలు, ఉలవపాడు మండలంలో 5 మందికి -5.48 లక్షలు, లింగసముద్రం మండలంలో 27 మందికి – 17.22 లక్షలు, గుడ్లూరు మండలంలో 10మందికి – 5.76 లక్షలు మంజూరయ్యాయి. చెక్కులు అందుకున్న వారు ఆనందభాష్పాలతో… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే నాగేశ్వరరావు కి కృతజ్ఞతలు తెలియజేశారు. చికిత్స కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తమకు, ప్రభుత్వం బాసటగా నిలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. MLA నాగేశ్వరరావు మాట్లాడుతూ… ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ… దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ నిధులు మంజూరు చేస్తోందని అన్నారు. పార్టీలకు అతీతంగా కందుకూరు నియోజకవర్గంలో ఆర్థిక సహాయాలు అందిస్తున్నామని తెలిపారు. CMRF ద్వారా నియోజకవర్గంలో ఇప్పటివరకు 31సార్లు చెక్కుల పంపిణీ జరిగిందని… మొత్తం 1214 మంది లబ్ధిదారులకు 9.82 కోట్ల రూపాయలు అందించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వారందరి తరపున ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గడిచిన ఐదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న జగన్మోహన్ రెడ్డికి, తమ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఎమ్మెల్యే నాగేశ్వరరావు విమర్శించారు. నీటిపారుదల శాఖకు 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని చేతగాని పరిపాలన చేశారని, రాష్ట్రానికి రాజధాని లేకుండా కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గారి నేతృత్వంలో రాజధాని అమరావతిలో అభివృద్ధి పరుగులు పెడుతోందని ఎమ్మెల్యే ఇంటూరి తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాకు, కందుకూరు నియోజకవర్గానికి కృష్ణా నీటిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఏడుపదుల వయసులో రోజుకి 20 గంటలు పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు ని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో లింగసముద్రం మండల టిడిపి అధ్యక్షులు పూరిమిట్ల గురునాథం, గుడ్లూరు మండల టిడిపి అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, కందుకూరు మండల టిడిపి అధ్యక్షులు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, వలేటివారిపాలెం మండల టిడిపి అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి బెజవాడ ప్రసాద్, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *