తొలి శుభోదయం న్యూస్ కంభంపోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, కంభం ఎస్సై ఆధ్వర్యంలో రావిపాడు, జంగంగుంట్ల మరియు చిన్న కంభం గ్రామాల ఆలయ కమిటీ సభ్యులతో భద్రతా అవగాహన సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఎస్పీ గారి మార్గదర్శకాలను కమిటీ సభ్యులకు వివరంగా తెలియజేశారు.ఆలయాల భద్రతను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆలయ ప్రాంగణంలో ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలని సూచించారు. అలాగే రాత్రి సమయంలో ఎలాంటి అనుమానాస్పద సంఘటనలు జరగకుండా ఉండేందుకు నైట్ వాచ్‌మెన్‌లను నియమించాలని ఆదేశించారు.అదనంగా, హుండీ నగదును తరచుగా ఖాళీ చేయడం ద్వారా చోరీలకు అవకాశం లేకుండా చూడాలని, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత పాటించాలని సూచించారు. ఆలయాల పవిత్రత మరియు భద్రతను కాపాడటంలో కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజల సహకారం అత్యంత కీలకమని పోలీసులు పేర్కొన్నారు.
సమావేశం ముగింపులో, పోలీసుల సూచనలను కచ్చితంగా పాటిస్తూ తమ తమ గ్రామాల్లో శాంతి భద్రతలను పరిరక్షించాలని పిలుపునిచ్చారు.