తొలి శుభోదయం న్యూస్ కంభం:-
డజర్ వాహనం లతో ఈద్గా నుండి ఆంజనేయ స్వామి దేవాలాలయం వరకు పరిశుభ్రంగా తొలగించారు.ఈ బృహత్తర ప్రత్యేక కార్యక్రమాలు ప్రతీ ఏడాది మై జీవన్ ఫౌండేషన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తి శేషులు షేక్.మహబూబ్ బాషా జ్ఞాపకార్ధం వారి కుమారులు షేక్ బాజీద్ బాష, డాక్టర్ షేక్ లతీఫ్ సాహెబ్ లు సంయుక్తంగా రంజాన్ పండుగ సందర్భంగా నిర్వహిస్థూవుంటారు. ఈ సంవత్సరం కూడా రంజాన్ పండుగ నమాజ్ సందర్భంగా మై జీవన్ ఫౌండేషన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు చేపట్టారు. ఈద్గా మైదానంలో రంజాన్ ప్రార్థనల కొరకు షామియానాలు, నమాజ్ చదవడానికి వజూ కొరకు నీళ్ల కుళాయిలు ఏర్పాటు, మ్యాట్ లు ఏర్పాటు తదితర కార్యక్రమాలు చేపట్టారు మై జీవన్ ఫౌండేషన్ సేవా సంస్థ సభ్యులు. ఈద్గా మైదానంను క్లీన్ అండ్ గ్రీన్ చేసిన కంభం సర్పంచ్ పల్నాటి బోడయ్య.మార్కాపురం జిల్లా కంభం మండలంలోని ఈద్గా మైదానంలో చిల్ల చెట్లు కంప చెట్లు చెట్ల మొద్దులు JCB వాహనం dozar వాహనం ద్వారా తొలగించారు. మై జీవన్ ఫౌండేషన్ సేవా సంస్థ మరియు కంభం గ్రామ పంచాయతీ సర్పంచ్ పల్నాటి బోడయ్య ఇద్దరూ కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.కంభం సర్పంచ్ పల్నాటి బోడయ్య పంచాయతీ కార్మికులతో ఈద్గా మైదానంను శుభ్రపరిచారు. రేపు రంజాన్ పండుగ నమాజ్ కొరకు అన్ని రకముల వసతులు సిద్ధం చేశారు….