👉ఒంగోలు రైల్వే స్టేషన్‌ లో మరియు రైళ్లలో విస్తృత తనిఖీలు – సుమారు 1.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

5హోలీ శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆధ్వర్యంలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్, ఎస్సైలు, స్పెషల్ పార్టీ, ఈగిల్ టీం, జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ సిబ్బంది సమన్వయంతో పాల్గొని, మాదకద్రవ్యాలను గుర్తించే జాగిలం సహాయంతో ఒంగోలు రైల్వే స్టేషన్‌తో పాటు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల బోగీలు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, పార్సెల్ కేంద్రాలు తదితర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.అనుమానాస్పదంగా కనిపించిన పార్సిళ్లు, ప్రయాణికుల బ్యాగులు మరియు ఇతర వస్తువులను ఒక్కొక్కటిగా పూర్తిగా పరిశీలించారు. ఈ క్రమంలో రైలు నెం. 18189 – ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లో ఒంగోలు నుంచి కావలి వరకు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 1.2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 1) మచ్చా భూను తండ్రి ప్రసాద్ (20 సం) జేక్ పూర్ (గ్రామం), రాయగడ (జిల్లా), ఒడిశా, అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోని, తదుపరి దర్యాప్తు నిమిత్తం జి.ఆర్.పి పోలీసులకు అప్పగించారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను రవాణా చేసే, విక్రయించే, వినియోగించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరించారు. గంజాయి మరియు మాదకద్రవ్యాల సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972, డయల్ 112, లేదా పోలీస్ వాట్సాప్ నంబర్ 9121102266 కు తెలియజేయవచ్చు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పోలీసులు తెలియజేశారు.ఈ తనిఖీలో మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సైలు సుదర్శన్, శ్రీరామ్,చెంచయ్య,RPF ఎస్సై, ఈగల్ టీం సిబ్బంది, డాగ్ హ్యాండ్లర్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *