తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

బడి పిల్లల మధ్యాహ్న భోజనం పై ప్రవచనకర్త గరికపాటి నర సింహారావు ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు కందుకూరు అంబేద్కర్ బొమ్మ సెంటర్ వద్ద బి.టి.ఏ మరియు ప్రజా సంఘాల తరపున నిరసన కార్యక్రమను నిర్వహించి గరికపాటిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేయడ మైనది. బి టి ఏ కందుకూరు డివిజన్ అధ్యక్షులు మండూరి రమణయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమములో అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కల్లగుంట మోహనరావు మాట్లాడుతూ
పసిపిల్లలు పేద పిల్లలకు ప్రభుత్వం బడిలో పెట్టే మధ్యాహ్న భోజనం పై ఇటీవల ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రజలంతా ముక్త కంఠంతో ఖండించాలని గుడ్డా గాడిద గుడ్డా అంటూ వ్యంగ్యంగా అవమానకరంగా మాట్లాడిన నరసింహరావును వెంటనే అరెస్టు చేయాలని డిమాండు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు విద్యా శాఖ మంత్రివర్యులు గాని విద్యాశాఖ అధికారులు గానీ స్పందించక పోవడం విచారకరమని చెప్తూ గరికిపాటికి ఇచ్చినటువంటి పద్మశ్రీని వెంటనే రద్దు చేయాలని కోరారు.సామాజిక ఉద్యమ నేత పాలేటి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఏమి తినాలి ఏమి తినకూడదు ఎలాంటి బట్టలు వేసుకోవాలని మనువాదం ఏదైతే చెప్పిందో ఈరోజు నరసింహారావు కూడా మనువాద భావజాలంతో మాట్లాడేడని దీనిని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. బి టి ఏ జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్లా మాట్లాడుతూ డ్రాప్ అవుట్స్ నివారణ కొరకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కొరకు పోషకాహార లోపాన్ని నివారించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వము ప్రవేశపెట్టిన ఈ మధ్యాహ్న భోజనం పై గరికపాటి అనుచితి వ్యాఖ్యలు సరైనవి కావని చెప్పారు.ఈ నిరసన కార్య క్రమములో దమ్మచక్ర ఫౌండేషన్ అధ్యక్షులు గాండ్ల. హరిప్రసాద్ బిటిఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్ట రమేష్, సిపిఎం ప్రజాసంఘ నాయకులు డివిజన్ ప్రధాన కార్యదర్శి కోప్పోలు శ్రీనివాసరావు, మండల బాధ్యులు గుడిపొడి అంజయ్య,కసుకుర్తి అంజయ్య,పిడి సుబ్రహ్మణ్యం, వీరనారాయణ ,శివరామయ్య, కాళీమాధవ అంబేద్కర్ యువజన సంఘ నాయకులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *