తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు రూరల్, రోగులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాల చర్మ వ్యాధుల డాక్టర్ పి. ప్రసాద్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తామర, సోయాసిస్, బోల్లి, పేను కొరుకుడు, మోoగు తదితర వ్యాధులకు వైద్య పరీక్షలను నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తున్నామని పేర్కొన్నారు. రోజు ఎక్కడ దాదాపు 50 మంది రోగులు వైద్య సేవల కొరకు వస్తున్నారు.కందుకూరు పరిసర ప్రాంతాల నుంచి పి ఆర్ పి కొరకు ఒంగోలు, నెల్లూరు తదితర ప్రాంతాలకు వెళ్లి ఒక్కొక్కరికి ఐదుసార్లు కలిపి వేలాది రూపాయలను ఖర్చు చేస్తున్నారని చెప్పారు.