ప్రభుత్వ పర్యవేక్షణ లో తీర ప్రాంత గ్రామం ఊళ్ల పాలెం.ఈ గ్రామం లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని పదవ తరగతి పరీక్షలలో గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం లో నూటికి నూరు శాతం మార్కులు సాధించి కార్పోరేట్ విద్యాసంస్థలకు ధీటుగా గర్వంగా నిలిచింది. అదే విధంగా మొదటి భాష లో 99, రెండవ భాష లో 95, మూడవ భాష లో 94 మార్కులు సాధించింది.తండ్రి ఒక సాధారణ కారు డ్రైవర్. అది కూడా బాడుగ కార్లకు వెళ్తాడు.ఆస్తి పాస్తులు లేక పోయినా పిల్లలకి చదువు తప్ప సంపద లేదని తన కూతురిని చదివిస్తున్నారు. తండ్రి, గురువులు ఇచ్చిన సహకారం, తర్ఫీదు తన కఠోర శ్రమ గర్వంగా తలెత్తుకునే లా చేసింది. తెలివి ఎవరి సొత్తుకాదు దాన్ని మోసంతో దొంగ దారిన అణచలేరు అని రాష్ట్ర విద్యా శాఖని ఎత్తి చూపింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, మండల, నియోజక వర్గ స్థాయిలో పెట్టినపోటీలలో రాష్ట్ర స్థాయిలో ఎంపిక అయినా నిబంధనల పేరుతో తనను తొక్కి పెట్టాలని చూసిన చర్య ఆమె లో కసిని పెంచింది. ఆ కసి పదవ తరగతి పరీక్షలలో కార్పోరేట్ విద్యాసంస్థలకు ధీటుగా 588 మార్కులు సాధించి గర్వంగా నిలిచింది.పడవ తరగతి పరీక్షలలో ఇంత గొప్ప విజయం సాధించేందుకు తర్ఫీదు ఇచ్చిన. బోధించిన ప్రోత్సహించిన గురువులు, తల్లి దండ్రులు, శ్రేయోభిలాషులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *