తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:-

మార్కాపురం జిల్లాలోని కనిగిరి మండలం, గవర్నమెంట్ హై స్కూల్ – కనిగిరి వేదికగా జన విజ్ఞాన వేదిక కనిగిరి నియోజక వర్గ శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి వక్తృత్వ పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం కనిగిరి, హనుమంతునిపాడు , పీసీపల్లి మరియు వెలిగండ్ల మండలాల శాఖల అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డా!! పెరుగు మురళి కృష్ణ గారు, ప్రకాశం జిల్లా విద్యా శాఖాధికారుల అధ్యక్షులు దేవిరెడ్డి రామి రెడ్డి , కనిగిరి విద్యా శాఖాధికారి నారాయణ రెడ్డి గారు, పి.సి పల్లి మండల విద్యా శాఖాధికారి శ్రీనివాసులు గార్లు పాల్గొని సందేశాలు ఇచ్చారు.
ఈ వక్తృత్వ పోటీల్లో విద్యార్థులు
నీకు నచ్చిన దేశ నాయకుడు,
ప్లాస్టిక్ కాలుష్యం – నివారణలు,
ఆహారపు అలవాట్లే ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి,నీకు నచ్చిన శాస్త్రవేత్త,
నేటి విద్యా విధానంవంటి అంశాలపై ప్రభావవంతమైన ప్రసంగాలు చేశారు.ఈ పోటీలకు జడ్జీలుగా రిటైర్డ్ విద్యాశాఖాధికారి మరియు కవి కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, రిటైర్డ్ విద్యాశాఖాధికారి ప్రసాద రెడ్డి , రిటైర్డ్ టీచర్ మాలకొండ రెడ్డి , రిటైర్డ్ టీచర్ ప్రసాద్ రెడ్డి , నాడీ వైద్య నిపుణులు కరుణానిధి మరియు కాకర్ల రమణయ్య వ్యవహరించి విద్యార్థుల ప్రసంగాలను నిష్పక్షపాతంగా మూల్యాంకనం చేశారు.దీనిలోని భాగంగా కనిగిరి మండల మొదటి బహుమతి బి. అశ్విని తేజ – కేటీఆర్ హైస్కూల్ – కనిగిరి, రెండవ బహుమతి ఎం. నాగ గీత లక్ష్మి – కేజీబీవీ – కనిగిరి, మూడవ బహుమతి ఎం. భార్గవి రెడ్డి కేటీఆర్ హై స్కూల్ కనిగిరి. హనుమంతుని పాడు మండల మొదటి బహుమతి కే. వాసవి – జడ్పిహెచ్ఎస్ – నందనవనం, రెండవ బహుమతి – ఎస్. నాగలక్ష్మి – జెడ్పిహెచ్ఎస్ – నందనవనం మరియు మూడవ భాగమతిగా కే. సంపూర్ణ – జడ్పిహెచ్ఎస్ – నందనవనం. పీసీపల్లి మండల మొదటి బహుమతిగా పి. నాగ శ్రావణి – జెడ్పిహెచ్ఎస్ – పెద అలవలపాడు, రెండవ బహుమతిగా కే. నిత్య – జెడ్పిహెచ్ఎస్ – పెద అలవలపాడు మరియు మూడవ బహుమతిగా కే. వైష్ణవి – జడ్పిహెచ్ఎస్ – మురుగమ్మి. వెలిగండ్ల మండల మొదటి బహుమతిగా కే.నవదీప్ కే.వీ.ఎన్ & ఎల్ హై స్కూల్ – కేఎన్ పురం, రెండవ బహుమతిగా ఎన్. వరప్రియ కె.వి.ఎన్ & ఎల్ హై స్కూల్ – కె ఎన్ పురం మరియు మూడవ బహుమతిగా ఎస్. కార్తీక్ – కె.వి.ఎన్ & ఎల్ హై స్కూల్ – కె.ఎన్. పురం మరియు కనిగిరి మండల ప్రోత్సాహక బహుమతులు కే. సంధ్య – జడ్పిహెచ్ఎస్ – పాతపాడు మరియు కె. శ్రీహారిక – హనీ స్కూల్ – కనిగిరి వారు సాధించారు.
ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్ మరియు బహుమతులు అందజేశారు. పుస్తకాల బహుమతులను కొండ్రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి బహుకరించారు. ఈ కార్య క్రమం జన విజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షులు షేక్ గయాజ్ భాషా , రాష్ట్ర సమాచార కార్యదర్శి ధనుంజయ్ , రాష్ట్ర సమతా విభాగం కొండమ్మ, ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె టి సి పాపారాయుడు, సాంస్కృతిక విభాగం మధు మరియు మిత్ర బృందం అధ్యక్షతన జరిగింది.వక్తలు మాట్లాడుతూ, ఇలాంటి వక్తృత్వ పోటీలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, శాస్త్రీయ దృక్పథం మరియు సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని జన విజ్ఞాన వేదిక కనిగిరి, హనుమంతునిపాడు, పీసీపల్లి మరియు వెలిగండ్లమండల శాఖ నాయకులు పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *