తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
భారత ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు, జనభా గణన (Census) 2027 ప్రక్రియపై ఎన్నుమరేటర్లకు మరియు సూపర్‌వైజర్లకు మూడు రోజుల పాటు సమగ్ర శిక్షణా కార్యక్రమం గిద్దలూరులోని సీతారామ కళ్యాణ మండపం నందు విజయవంతంగా పూర్తిచేయబడింది.ఈ కార్యక్రమానికి గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ ఈ.వి. రమణ బాబు (ఛార్జ్ ఆఫీసర్) అధ్యక్షత వహించారు.ఈసందర్భంగాఆయనమాట్లాడుతూ రాబోయే 2027 జనభా గణన దేశంలోనే మొట్ట మొదటి పూర్తిస్థాయి డిజిటల్ సెన్సస్ అని, దీనిని అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి శిక్షకులగా డాక్టర్ మొర్రి. పిచ్చయ్య, ఎం. బాల గురవయ్య, రామచంద్రారెడ్డి లు నియమించబడి ఎన్నుమరేటర్లకు, సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చారు. చక్కటి శిక్షణ ఇచ్చినందుకు ఫీల్డ్ ట్రైన్లర్లకు చార్జ్ ఆఫీసర్ ఈ.వి. రమణ బాబు గారు ఘన సన్మానం చేశారు.