తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-

సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి హాజరై లోక్ అదాలత్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రజలు చిన్న చిన్న వివాదాలను కోర్టు వెలుపల స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ మంచి వేదిక అని ఆమె పేర్కొన్నారు.శనివారం జరిగిన లోకదాలత్ లో క్రిమినల్ కేసులు 127,సివిల్ కేసులు 45, పెట్టి కేసులు 1042, అన్ని కేసులు కలిపి 1214 కేసులు పరిష్కరించబడ్డాయి.
ఒక కోటి ఇరవై మూడు లక్షల, డెబ్భై ఎనిమిది వేల నాలుగు వందల పది రూపాయలు సెటిల్మెంట్ అఫ్ మనీ అయినవి.
కార్యక్రమానికి సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు అధ్యక్షత వహించగ లోక్ అదాలత్ మెంబర్లు గా కొల్లూరి వెంకట నరసింహరావు, బక్కమంతల వెంకటేశ్వర్లు వ్యవహరించారు.కార్యక్రమంలో సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ చావా హాజరత్తయ్య , కొండపి సర్కిల్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా వివాదాలు త్వరితగతిన పరిష్కారం కావడం వల్ల ప్రజలకు సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీస్ అధికారులు మరియు పలువురు ప్రజలు పాల్గొన్నారు.లోక్ అదాలత్ ద్వారా అనేక పెండింగ్ కేసులు పరస్పర అవగాహనతో పరిష్కారం కావడం జరిగింది. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *