మీడియా ప్రతినిధులు తప్పని సరిగా ఆధార్ కార్డు తీసుకొని ఉదయం 8.30 గంటలకు జిల్లా ప్రధాన ఆసుపత్రికి రావలెను
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోదకుమార్
తొలి శుభోదయం న్యూస్ బాపట్ల : –
మీడియా ప్రతినిధుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఇంచార్జి మంత్రి మరియు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో డి యం & హెచ్ ఓ.డాక్టర్ ఎస్. విజయమ్మ అధ్యక్షతన ఈ నెల 24వ తేదీ (మంగళవారం) ఉదయం 8.30 గంటలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నందు జిల్లాలోని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యుల కు ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ వైద్య శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు, వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి సలహాలు చుచనాలు ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. మీడియా ప్రతినిధులు వారి కుటుంబ సభ్యులు తప్పని సరిగా ఆధార్ కార్డు / జీరాక్స్ తీసుకొని రావాలన్నారు.
ఈ వైద్య శిబిరాన్ని మీడియా ప్రతినిధులు వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని, సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.