తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీతగారిని మాలల జేఏసీ (JAC) జిల్లా వైస్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గొట్టిముక్కల యోహాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన కలెక్టర్ గారికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రజా సమస్యలను, ముఖ్యంగా అణగారిన వర్గాల సంక్షేమానికి సంబంధించిన అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని యోహాన్ కోరారు. సామాజిక అభివృద్ధి కోసం పనిచేస్తున్న నాయకుల కృషిని అభినందిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని కలెక్టర్ విజయ సునీత గారు సానుకూలంగా స్పందించారు. దళిత సామాజిక వర్గాల హక్కుల కోసం, ప్రజా సేవలో నిరంతరం శ్రమిస్తున్న గొట్టిముక్కల యోహాన్, అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం పట్ల జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాలల జేఏసీ ప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు.