తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో సింగరాయకొండ మండలము సింగరాయకొండ RSK 2 లొ మండల వ్యవసాయ శాఖ అధికారి గారు పూర్ణచంద్రారావు ఆధ్వర్యంలో రైతు సేవ కేంద్రం వి ఏ ఏ లకు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఐ సి ఆర్ పి లకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు అందులో వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయ రంగం అధిక దిగుబడుల కోసం అధిక ఆదాయం కోసం రసాయనాలు పురుగుమందులు విచక్షణ రహితంగా వాడటం వలన భూములు నిస్సారమై చౌడు భూములుగా మారుతున్నాయి భూమిలో పోషకాలు లేవు సూక్ష్మజీవులు కనుమరుగవుతున్నాయి భూమి సారవంతము లేదు పంటలు దిగుబడులు తగ్గుతున్నాయి ఖర్చులు ఎక్కువవుతున్నాయి కనుక రైతు సోదరులకు వాటి వల్ల జరిగే నష్టాలు గురించి రైతులకు తెలియజేయాలని చెప్పడం జరిగింది అన్ని రకాల పంటల పైన పురుగుమందులు వాడటం వల్ల వాటి ద్వారా వచ్చే ఉత్పత్తులు విషపూరితమైన ఆహార ఉత్పత్తులు తినడం వలన అనేక రోగాలకు గురి అవుతున్నాము వీటిని సేంద్రియ పద్ధతిలో ప్రతి రైతు ఆరోగ్యవంతమైన పంటలు పండించుకోవడానికి రైతులకు అవగాహన కల్పించాలని తెలియజేశారు అందులో భాగంగా నవధాన్యాలు భూముల వేయడం వల్ల వాటి ప్రయోజనాలు పురుగు మందులు స్థానంలో కషాయాలు ద్రావణాలు వాడాలని భూసారానికి చెరువు మట్టి పచ్చ రొట్టెపైర్లు ఘనజీవామృతం ద్రవజీవామృతం కాంపోస్ట్ ఎరువులు బయోపార్టిలైజర్స్ వాడించాలని తెలియజేశారు మండలంలో ప్రకృతివ్యవసాయ మండల ఇంచార్జ్ ఏ వెంకటరమణ వారి సిబ్బందితో విత్తన గుళికలు తయారు చేసేవిదానం ప్రాక్టికల్గా చేసి చూపించారు వాటి ఉపయోగాలు గురించి తెలియజేశారు ప్రకృతి వ్యవసాయ సాగు రైతులతో చేపించిన పాకల గ్రామంలో వివిధ రకాల పంటలను ప్రత్యక్షంగా సందర్శించడం జరిగింది ఫీల్డ్ చూపించారు రైతుల అనుభవాలు తెలుసుకోవడం జరిగింది కొక్కిలిగడ్డ జ్యోతి 50 సెంట్లు విస్తీర్ణంలో విత్తన గుళికల తో చేయించిన 10 రకాల విత్తనాలతో pmds వేయించడం జరిగింది పాకల రైతు సేవా కేంద్రంలో రైతులకు కావలసిన 15 రకాల విత్తనాలతో పీఎండీఎస్ కిట్లు తయారు చేయడం జరిగింది ఈ విధంగా మండలంలోని శా నం పూడి సోమరాజుపల్లి TP నగర్లో బయో ఇన్పుట్స్ సెంటర్లు ఉన్నాయి వాటి ద్వారా రైతులకు కావలసిన అన్ని రకాల ఇన్పుట్స్ అందుబాటులో లభించును కనుక గ్రామాలలో రైతులు అందరి చేత ప్రకృతి వ్యవసాయం చేయించాలని తెలియజేశారు ఈ శిక్షణ కార్యక్రమానికి రైతు సేవా కేంద్రం సిబ్బంది ప్రకృతి వ్యవసాయ సిబ్బంది హాజరు కావడం జరిగింది
