తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
గ్రామపంచాయతీకి సంబంధించిన మొత్తం డిమాండ్ ₹239.04/- లక్షలు కాగా, ఇప్పటివరకు ₹81.54/- లక్షలు మాత్రమే వసూలు చేయబడింది (34.11%). ఇంకా ₹157.5/-లక్షలు (65.89%) వసూలు చేయాల్సి ఉన్నది. ఇది చాలా తక్కువ ప్రగతి అని అధికారి అసంతృప్తి వ్యక్తం చేశారు.పెండింగ్ బకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక బృందాలు 6(Special Teams) ఏర్పాటు చేసి తేది. 15/03/2026 లోపు 100% వసూళ్లు పూర్తి చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు.ఇంటి పన్ను వసూళ్లలో ఎటువంటి నిర్లక్ష్యం, ఆలస్యం లేదా నిర్లిప్తత సహించబడదని, బాధ్యులపై చట్టపరమైన మరియు శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టంగా హెచ్చరించారు. సాయి శ్రీనివాస కళ్యన మండపం యాజమానులతో . జిల్లా పంచాయితీ అధికారి స్వయం మాట్లాడి టాక్స్ కలెక్షన్ RS. 1,23,476/- లను కలెక్షన్ చేయడమైనది.కిరాణా షాప్ వారి నుండి RS.15,254/- లను కలెక్షన్ చెయ్యడమైనది. కాబట్టి సంబంధిత సిబ్బంది అందరూ దీనిని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని, రోజువారీ ప్రణాళికతో వసూళ్లు వేగవంతం చేసి, వెంటనే పూర్తి చేయవలసినదిగా ఆదేశించడమైనది.ఈ కార్యక్రమములో . జిల్లా పంచాయితీ అధికారి ఎం . వెంకటేశ్వర రావు. మరియు శ్రీయుత. R రమేష్ DY. MPDO టాక్స్ కలెక్షన్ చేయు 6 టీమ్స్ పాల్గొన్నారు.