తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
జిల్లా వ్యాప్తంగా నైట్ పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., ఆదేశాలతో నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తున్నారు.నేర నియంత్రణతో పాటు అసాంఘిక కార్యకలాపాల కట్టడి, ప్రజల్లో భద్రత భావాన్ని పెంపోదించడం కోసం ప్రతీ రోజు నైట్ పెట్రోలింగ్ విధులు కొనసాగుతున్నాయి.కింది స్థాయి సిబ్బంది నుండీ ఎస్సైలు, సి.ఐ లు, డీఎస్పీల దాకా రాత్రి వేళ మరింత అప్రమత్తతో గస్తీ విధులు, పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. బీట్ తనిఖీ అధికారులు, సిబ్బంది వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి రవాణా వివరాలు, కొత్త వ్యక్తుల వివరాలు ఆరా తీసి అక్రమ రవాణాను అరికట్టే చర్యలు తీసుకుంటున్నారు. బీట్ తనిఖీ అధికారులు తరచూ బీట్ పాయింట్స్ తనిఖీ చేసి, సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఎటువంటి నేరాలు జరగకుండా పకడ్బందీగా గస్తీ విధులు నిర్వర్తించేలా చేస్తున్నారు.లాడ్జి రూమ్స్ లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.లాడ్జిలో ఉంటున్న వారి అధార్ కార్డు పరిశీలించి వారు వివరాలు సేకరించారు.లాడ్జిలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.నైట్ పెట్రోలింగ్ ముమ్మరం చేసి అనుమానాస్పద/కొత్త వ్యక్తుల యొక్క వివరాలు ఆరా తీశారు. పాత నేరస్తులు, అనుమానితులు, చెడునడత కలిగిన వారి పై నిఘాను పెడుతున్నారు. మొబైల్ చెక్ డివైస్ ద్వారా అనుమానితులను చెక్ చేస్తున్నారు. దొంగతనాలు, చట్టవ్యతిరేఖ/అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచుతూ కట్టడి చేస్తున్నారు. దేవాలయాలు, ఎటిఎం కేంద్రాలు, ఇతర ముఖ్య వ్యాపార సముదాయాలు వద్ద అప్రమత్తంగా తిరుగుతూ అనుమానాస్పద వ్యక్తులను విచారించి తనిఖీ చేస్తున్నారు. రాత్రి పూట దొంగతనాలు, అల్లర్లు/గొడవలు జరగకుండా, కారణం లేకుండా రాత్రి వేళ తిరిగే ఆకతాయిల పై…. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.ఇదిలా ఉంటే తెల్లవారు జామున వెహికిల్ డ్రైవర్లు తరచూ స్టాప్ అండ్ వాష్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూస్తున్నారు.
