తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్ :-

కట్టుదిట్టమైన చర్యలుఅక్రమ కార్యకలాపాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూద స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. అనుమానిత ప్రదేశాలను తనిఖీ చేసి, జూదంలో పాల్గొన్న వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి అవసరమైన చర్యలు చేపట్టారు. జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.అదేవిధంగా మార్కాపురం జిల్లా పోలీస్ శాఖ కొమరోలు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం ఎదురుభాగంలో ఉన్న ఓపెన్ డ్రింకింగ్ స్థలాలను గుర్తించి ప్రత్యేక శుభ్రతా చర్యలు చేపట్టారు. దేవాలయానికి వచ్చే భక్తులకు మరియు స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించడం జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రదేశాన్ని పూర్తిగా శుభ్రపరిచి, ఇకపై ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు.జూదం, బహిరంగ మద్యం సేవించడం వంటి చట్టవిరుద్ధ చర్యలు సమాజానికి హానికరమని, ప్రజలు ఇలాంటి ఘటనలను గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే నేరరహిత, శాంతియుత సమాజ నిర్మాణం సాధ్యమని పోలీసులు పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *