తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-

స్థానిక టంగుటూరు పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ చైతన్య హై స్కూల్ నందు పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సభ వైభవంగా జరిగినది ఈ కార్యక్రమంలో పదో తరగతి విద్యార్థులకు, తొమ్మిదో తరగతి విద్యార్థులు పాల్గొని వీడ్కోలు పడకటం జరిగినది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరము విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అబ్బురపరిచాయి. ఈ సభకు ముఖ్య అతిథులుగా టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు, శ్రీ సరస్వతి కళాశాలల చైర్మన్ ఏ.వి రమణారెడ్డి, రిటైర్డ్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ పత్తిపాటి బ్రహ్మానందం, ప్రధానోపాధ్యాయురాలు ఎన్ . వెంకాయమ్మ, కరస్పాండెంట్ వి.వి రమణ ,డైరెక్టర్ వి.వి రాజసింహ తదితర ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎస్సై నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులకు పరీక్షల మేలుకువలను , జాగ్రత్తలను ప్రస్తుతము యువత ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాలైనటువంటి విషమ పరిస్థితుల్ని చక్కగా వివరించి చెప్పారు. సరస్వతి కళాశాల చైర్మన్ ఏ.వి రమణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు పరీక్షల్లో ఉన్నతమైన మార్కులు సంపాదించడానికి అనేక రకాలైన సలహాలని ,మెలుకువలను, నూరు శాతం మార్కులను ఎలా సాధించాలి అనే చక్కని సూచనలను విద్యార్థులకు తెలియపరిచారు. కరస్పాండెంట్ వి.వి రమణ మాట్లాడుతూ 43 సంవత్సరాలుగా టంగుటూరు పంచాయతీలో అలుపెరగని విద్య అందిస్తూ అనేకమంది ఉన్నతమైనటువంటి విద్యార్థులను తీర్చిదిద్దిన అత్యున్నత విద్యా సంస్థగా జిల్లాలోనే అగ్రగామి సంస్థ అని చెప్పటం లో ఎటువంటి సందేహమే లేదని తెలియజేశారు. ప్రధానోపాధ్యాయురాలు ఎన్. వెంకాయమ్మ మాట్లాడుతూ మా పాఠశాల యందు విద్యను అభ్యసించిన అనేకమంది పూర్వ విద్యార్థులు ఉన్నతమైన స్థితిలో ఈరోజు ఉన్నారని, చక్కని విలువలతో కూడిన విద్యను అందించడంలో, మంచి పునాది తో కూడిన ఐ.ఐ.టీ ఫౌండేషన్ తో టంగుటూరులోనే కార్పోరేట్ సంస్థలకు దీటుగా విద్యని అందిస్తున్నటువంటి ఏకైక విద్యా సంస్థగా శ్రీ చైతన్య అని తెలియపరిచారు. డైరెక్టర్ వి.వి రమణ మాట్లాడుతూ గత ఏడాది వరుసగా 592, 591 590 ,589 మార్కులతో అనేక మంచి ఫలితాల్ని అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. గత సంవత్సరం నూటికి నూరు మార్కులను సాధించడంలో కృషిచేసిన ఉపాధ్యాయులకు పారితోషకాలు ప్రకటించి, అతిధుల సమక్షంలో ఇవ్వడం జరిగినది. తదుపరి ఈ సంవత్సరము నిర్వహించిన ఫ్రీ ఫైనల్ పరీక్షలు నందు అత్యున్నత ప్రతిభను కనపరచిన మొదటి 15 మంది విద్యార్థులకు, అలానే 9వ తరగతిలో నిర్వహించిన పరీక్షలు నందు ప్రతిభ కనపరిచిన 15 మంది విద్యార్థులకు మెమొంటోలు ప్రధానం చేయడం జరిగినది. తదుపరి ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయులు పిల్లలకు పరీక్షలను వ్రాయుటకు తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు ప్రతి సబ్జెక్టు మెలుకులను చక్కగా వివరించి తెలియపరిచారు. 9 ,10 తరగతి విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో తొమ్మిది ,పది తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగినది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *