తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు, జిల్లా పోలీసులు రహదారి భద్రతను కాపాడటానికి మరియు ట్రాఫిక్ నియమాలను అమలు చేయటానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నియమాలు మరియు నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనదారులపై ఈ-చలాన్ (E-Challan) ద్వారా జరిమానాలు విధిస్తున్నారు.హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడపడం, సీట్ బెల్ట్ లేకుండా వాహనం నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, మైనర్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, ఓవర్లోడింగ్ వంటి ఉల్లంఘనలను గుర్తించి చర్యలుతీసుకుంటున్నారు.“రోడ్డు భద్రత మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తే ప్రాణ నష్టం జరగదు. ప్రజల ప్రాణ భద్రతే మా ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నారు.ప్రకాశం జిల్లా పోలీసులు రహదారులపై క్రమశిక్షణతో కూడిన ప్రయాణం కోసం, ప్రజల భద్రత కోసం ఈ డ్రైవ్‌ను నిరంతరంగా కొనసాగిస్తున్నారు.
