నిమ్మకు నీరెత్తిన ప్రభుత్వ యంత్రాంగం తీరు
తౌషిక్ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సిపిఐ డిమాండ్
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ మండలంలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో చదువుతున్న 6వ తరగతి విద్యార్థి తౌషిక్ అనుమానస్పద మరణంపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి పూర్తి నిజాలను ప్రజలకు వెల్లడించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జాల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో ఆయన విద్యార్థి చదువుతున్న హాస్టల్ ను, స్కూలు పరిసర ప్రాంతాలలో ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ఇది ముమ్మాటికి ఉద్దేశపూర్వకంగా హత్య గావించబడ్డాట్లు తెలుస్తుందని శనివారం సింగరాయకొండ లోని సరస్వతి కల్యాణ మండపంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.తౌషిక్ కుటుంబానికి అండగా నిలవాలని రాష్ట్ర పరిధిలోని ప్రజాసంఘాల నాయకులను ఆయన కోరారు. తౌశిక్ మరణం ఒక్క కుటుంబానికి చెందిన విషాదం మాత్రమే కాదని విద్యా వ్యవస్థలో కొనసాగుతున్న అక్రమాలు నిర్లక్ష్యం మరియు పర్యవేక్షణ లోపాలకు నిదర్శనం అని ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది అని పేర్కొన్నారు. శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ లో ఫిబ్రవరి 14వ తేదీ జరిగిన ఆరో తరగతి కనిగిరి కి చెందిన విద్యార్థి సయ్యద్ తౌషిక్ ( 11 ) తల్లిదండ్రులు సయ్యద్ అలీ, మౌలాభి న్యాయం కోసం అప్పటి నుండి పోరాటం చేస్తున్న ప్రభుత్వ అధికార యంత్రాంగం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుందని అన్నారు.విద్యార్థి చనిపోక ముందు రాత్రి తల్లిదండ్రులతో సంతోషంగా మాట్లాడినట్లు బీచ్ ఫెస్టివల్ కు వెళుతున్నట్లు మాట్లాడిన 12 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకునే అవసరం ఏముంటుందని, బాత్రూంలో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎలాంటి ఆనవాలు లేవని ఇది ముమ్మాటికి ఉద్దేశపూర్వకంగా హత్య చేశారని ఆయన పేర్కొన్నారు.శ్రీ చైతన్య స్కూల్ కి అధికారికంగా లైసెన్స్ లు రద్దు చేయాలని, ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షాన ఈ పోరాటాన్ని భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఉదృతం చేసి సీఎం చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు. ఎం.ఎల్ నారాయణ సిపిఐ జిల్లా కార్యదర్శి, ఆర్ వెంకట్రావు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి, కే వీరారెడ్డి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఆర్ విజయ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు, ఆర్ లక్ష్మి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి, తిరుపతిరావు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మిరియం శ్రీనివాసరావు బీసీ సంఘం నాయకులు, సుల్తాన్ యునైటెడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్, బి సురేష్, పోతుల ప్రభాకర్, జేపీ రామారావు, టీ ప్రభాకర్, బాలాజీ, జాకీర్, ఆనందమోహన్, పవన్, బాలిరెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకులు పటేల్, సుల్తాన్, ఎస్ దాని, జావేద్, ఇంతియాజ్, కరీం, అబ్దుల్, గౌస్ బాషా, ఇస్మాయిల్, అల్లా బక్షు, సుల్తాన్, దావీద్, హర్షద్, ఇజాజ్, అహ్మద్, ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
