తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:=
ఒంగోలు కలెక్టరేట్ నందు గల డి ఆర్ ఓ గారి చాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సభ్యులతో సమావేశం జరిగింది, ఈ కార్యక్రమం జిల్లా డి ఆర్ ఓ ఓబులేసు ఆధ్వర్యంలో జరిగింది, డి ఆర్ ఓ మాట్లాడుతూ జిల్లా లో ఇప్పటి వరకు మ్యాపింగ్ కార్యక్రమం 75 శాతం అయ్యిందని మిగతా 25 శాతం పూర్తి చెయ్యాలని అధికారులకు తెలిపారు,త్వరలో ప్రకాశం జిల్లా లో కూడా ఏప్రిల్ నుండి జనగనణ మరియు స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ కార్యక్రమలు మొదలవుతాయని తెలిపారు,ఈ రెండు కార్యక్రమాలు తెలంగాణ,మరియు ఆంధ్రప్రదేశ్ లో ఒకే సారి జరుగుతుందని ఈ కార్యక్రమం ద్వారా రెండు, మూడు ఓట్లు ఉన్న వారివి తొలిగిపోవటం జరుగుతుందని, అలానే జిల్లా లోని అన్ని నియోజకవర్గలలో చనిపోయిన వారి ఓట్లు ఈ సార్ కార్యక్రమం తో తొలిగిపోతాయని తెలిపారు,వెంటనే అన్ని నియోజకవర్గలలో పోలింగ్ బూత్ లెవల్ ఏజెంట్ల ను రాజకీయ పార్టీల వారు ఏర్పాటు చేసుకోవాలని కోరారు,ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకొని వారు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని కోరారు ,18 సంవత్సరలు నిండిన యువత ఓట్లు నమోదు చేసుకోవాలని కోరారు, వైసీపీ నాయకుడు దామరాజు క్రాంతికుమార్ మాట్లాడుతూ జిల్లా లో జనగనణ మరియు స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ కార్యక్రమం ఎప్పటి నుండి మొదలవుతుందని కోరారు, అలానే నగరంలో డోర్ నెంబర్లు కొన్ని చోట్ల వెయ్యలేదని, ఒంగోలు నగరంలో కొన్ని డివిజన్స్ మాత్రమే వేశారని మిగతా డివిజన్స్ వెయ్యాలని క్రాంతికుమార్ కోరారు,ఈ కార్యక్రమం లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, మరియు అధికారులు , యర్రగొండపాలెం ఈ ర్ ఓ సత్యనారాయణ,జిల్లా ఎలక్షన్ సెల్ సూపరంటెండ్ శ్రీనివాసరావు, పొలిటికల్ పార్టీల ప్రతినిధులు వైసీపీ తరుపున దామరాజు క్రాంతికుమార్,వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ,జిల్లా వైసీపీ ఎలక్షన్ సెల్ రీప్రజెటీటివ్,కాంగ్రెస్ ఎస్.కె రసూల్,టీడీపీ కె నాగేశ్వరావు,,బీజేపీ గుర్రం సత్యం, ,జిల్లా డీటీ లు,ఎలక్షన్ ఆఫీస్ నుండి ఉపేంద్ర ఒంగోలు ఎమ్మార్వో ఆఫీస్ , సలోమి,పాల్గొన్నారు.
