తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
మార్చి 12వ తేదీ సింగరాయకొండ లో జరుగు దండి మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ డా. శ్రీ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు
మాదకద్రవ్యాలు పట్ల ప్రజలుచైతన్యం కలిగి ఉండాలని దేశ యువత భవిష్యత్తుకి ప్రతి బంధకంగా మారిన మాదకద్రవ్యాల పట్ల ప్రతి ఒక్కరిలో అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు వైబ్రేషన్స్ ఆఫ్ కలం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 100 మీ. జాతీయ పతాకంతో ఈ ర్యాలీ జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీకి సంబంధించిన పోస్టరు ఆయన ఆవిష్కరించారు ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేసే కార్యక్రమం తలపెట్టినట్లు ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ రావినూతల జయ కుమార్ తెలిపారు .కందుకూరు రోడ్డు నుండి పాకల రోడ్డు వరకు ఈ ర్యాలీ వేలాది మంది విద్యార్థులతో జరుగుతున్నట్లు ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రతి విద్యార్థులు యువత పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డొక్కా కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు