తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు, దర్శి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామారావు ఆధ్వర్యంలో దర్శి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ సాయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికుల సామాను, పార్శిల్ ఆఫీస్ ప్రాంతం, లగేజీ కౌంటర్లు, వాహన పార్కింగ్ ప్రదేశాలను పూర్తిగా తనిఖీ చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా అనుమానాస్పద వ్యక్తులు, లగేజీలపై సమగ్ర పరిశీలన చేపట్టారు.ప్రజలు ఎటువంటి అనుమానాస్పద వస్తువులు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, తమ భద్రత కోసం పోలీసు శాఖకు సహకరించాలని సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *