తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :-
దర్శి పట్టణంలోని శివరాజనగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న క్రికెట్ స్టేడియం పనులను జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు మరియు టీడీపీ ఇంచార్జ్ డాక్టరు గొట్టిపాటి లక్ష్మి పరిశీలించారు. క్రీడల్లో రాణించే యువతకు ఈ స్టేడియం ఒక గొప్ప వేదికగా మారబోతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్టేడియాన్ని తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం మరియు స్థానిక నాయకత్వం సంయుక్తంగా కృషి చేస్తోంది.