తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :-

శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు దోర్నాల మండలంలోని సుందరయ్య కాలనీలో కట్టుదిట్టమైన కార్డన్ & సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వీధిని తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాలను పరిశీలించారు. తనిఖీలలో సరైన పత్రాలు లేని 5 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.దోర్నాల పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఆధ్వర్యంలో సిబ్బంది ఈ తనిఖీలు నిర్వహించి, ప్రజలు తమ వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. అలాగే, అసాంఘిక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు.శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *