తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు వినూత్నంగా ‘Face Wash and Go’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు చెందిన అధికారులు మరియు సిబ్బంది జాతీయ, రాష్ట్ర రహదారులపై తెల్లవారుజామున 1:00 గంటల నుండి 4:30 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీర్ఘదూర ప్రయాణం చేసే డ్రైవర్లు అలసట కారణంగా నిద్రమత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, పోలీసులు హైవేలపై వాహనాలను నిలిపి డ్రైవర్లను ముఖం కడుక్కోవాలని, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని మరియు టీ తాగి తాజాగా ప్రయాణం కొనసాగించాలని సూచించారు. డ్రైవింగ్ చేసే సమయంలో తమ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుని అప్రమత్తంగా వాహనాలు నడపాలని, వేగ పరిమితులను పాటించాలని మరియు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఇలాంటి వినూత్న కార్యక్రమాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *