తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :-

నూతన మార్కాపురం జిల్లాలో జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేసే క్రమంలో, మార్కాపురం–పొదిలి ప్రధాన రహదారిపై రాయవరం గ్రామ సమీపంలో ఉన్న సుమారు 25 ఎకరాల ప్రభుత్వ భూమిని సోమవారం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., పరిశీలించారు ఈ సందర్భంగా భూమి స్థితి, రవాణా సౌకర్యాల అందుబాటు, భద్రతా పరమైన అంశాలు, ప్రజలకు చేరువ, అలాగే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి అవకాశాలను సమీక్షించారు. జిల్లా పోలీస్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, పోలీస్ పరేడ్ గ్రౌండ్, ఆర్మ్డ్ రిజర్వ్ (AR) కార్యాలయం వంటి కీలక విభాగాలను ఏర్పాటు చేయడానికి అనువైన పరిస్థితులపై జిల్లా ఎస్పీ గారు అధికారులతో చర్చించారు. ప్రజలకు మరింత వేగవంతమైన మరియు సమర్థవంతమైన పోలీస్ సేవలు అందించే అవకాశం ఉందన్నారు.అయితే, ప్రస్తుతంగా పరిశీలించిన భూమికి తోడు ఇంకా చదునైన మరియు అన్ని విధాలుగా అనుకూలమైన ప్రత్యామ్నాయ ప్రదేశాలను కూడా గుర్తించి పరిశీలించాలని సంబంధిత రెవిన్యూ శాఖ మరియు పోలీస్ అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ యు.నాగరాజు, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, మార్కాపురం సీఐ సుబ్బారావు, మార్కాపురం రూరల్ ఎస్సై వేమన, సంబంధిత రెవెన్యూ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *