తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో పోలీస్ యంత్రాంగం రాత్రివేళల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. జిల్లా ఎస్పీల ఆదేశాల మేరకు పట్టణాలు, గ్రామాలు, జాతీయ రహదారులు, రద్దీ ప్రాంతాలు మరియు సున్నిత ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా ‘నైట్ బీట్’ (Night Beat) నిర్వహిస్తూ అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తున్నారు.అర్ధరాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులను నిలదీసి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వారి వివరాలు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా తాళం వేసి ఉన్న ఇళ్లు, బ్యాంకులు, ఏటీఎంలు, వ్యాపార సముదాయాలు మరియు ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో నిరంతర గస్తీ కాస్తూ దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా ‘విజిబుల్ పోలీసింగ్’ అమలు చేస్తున్నారు.ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయేలా పోలీసు సిబ్బంది రాత్రంతా అప్రమత్తంగా పహారా కాస్తూ, అడుగడుగునా నిఘా కొనసాగిస్తున్నారు. ఏవైనా అనుమానాస్పద కదలికలు గమనించినట్లయితే వెంటనే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని, నేరరహిత సమాజ నిర్మాణానికి పోలీసులకు సహకరించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *