యహోలీ శుభోదయం న్యూస్ కందుకూరు:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కందుకూరు డిఎస్పీ ఆధ్వర్యంలో కందుకూరు సిఐ అన్వర్ భాష పలుకూరు గ్రామం నందు ఆదివారం నేరాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వలన ఏదైనా నేరం జరిగితే సదరు నేరమును కనుగొనటానికి సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర వహిస్తుందని దొంగతనం వంటి నేరములు చేసే వ్యక్తులు సీసీ కెమెరాలు ఉండటం వలన నేరము
చేయుటకు కూడా వెనకడుగు వేస్తారని తెలియజేశారు.అనంతరం డ్రగ్స్ గంజాయి వంటి మాదకద్రవ్యాలు వాడకం పేకాట, కోడి పందాలు వంటివి నిర్వహించకూడదని తెలిపారు.ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించవలసిందిగా ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై బాలకృష్ణ సిబ్బంది పలుకూరు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *