తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
గురువారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో టంగుటూరు శ్రీ చైతన్య హై స్కూల్ ప్రభంజనం సృష్టించింది.. 600కు 593 మార్కులతో అద్దంకి జాహ్నవి మండలం ఫస్ట్,600కు 590 మార్కులతో బయ్యారపు తహిర్ మండలం సెకండ్ మార్కులతో విజయకేతనం ఎగరవేశారు. ఇరువురిని పాఠశాల కరస్పాండెంట్ వి.వి రమణ, ప్రధానోపాధ్యాయురాలు ఎన్. వెంకాయమ్మ, డైరెక్టర్ వి.వి రాజసింహ అభినందనలు తెలియపరిచారు.. ప్రధానోపాధ్యాయురాలు వెంకాయమ్మ మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థిని, విద్యార్థులను అలాగే ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులను అభినందించారు. కరస్పాండెంట్ వి.వి రమణ మాట్లాడుతూ ఇంతటి అత్యున్నత ఫలితాల సాధనలో కృషిచేసిన విద్యార్థిని విద్యార్థులను, ఉపాధ్యాయ సిబ్బందిని అభినందించారు. డైరెక్టర్ వి.వి రాజసింహ మాట్లాడుతూ ఉత్తమ ఫలితాల సాధనలో మా అధ్యాపక బృందం యొక్క కృషి , విద్యార్థుల యొక్క శ్రమ ఫలితమే కారణమని అభినందించారు..
500కు పైగా మార్కులు సాధించిన మా విద్యార్థులు 31 , తెలుగు, గణితం, సైన్సు ,సోషల్ సబ్జెక్టుల్లో నూరు మార్కులతో విజయం సాధించటం జరిగినదని తెలియపరిచారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు, ఉపాధ్యాయ సిబ్బందికి తల్లిదండ్రులు అందరూ అభినందనలు తెలియపరిచారు.
