తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

ఈ ఉదయం కందుకూరు పట్టణంలోని 12వ వార్డు పోతురాజుమిట్ట ప్రాంతంలో, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి, పింఛన్ మొత్తాన్ని వృద్ధులు, వికలాంగులకు అందజేశారు. తమ కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేస్తోందని, ఒకటవ తేదీ ఆదివారం కావడంతో.. లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా, ఒకరోజు ముందుగానే పింఛన్లు ఇస్తున్నామని ఎమ్మెల్యే గారు తెలియజేశారు. అయినప్పటికీ వైసీపీ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని, వారి వ్యవహార శైలిలో ఇప్పటికి కూడా మార్పురాలేదని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. ఈసారి ఎన్నికల్లో కూడా వారు గెలిచే పరిస్థితి లేదని ఎమ్మెల్యే అన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *