తొలి శుభోదయం న్యూస్ కొండేపి:-

ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు మరియు కందుకూరు ఎస్.డి.పి.ఓ.సిహెచ్. వి. బాలసుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో, ఆదివారం ఉదయం కొండేపి మండల కేంద్రంలోని బీసీ కాలనీలో కార్డెన్ అండ్ సెర్చ్ (తనిఖీలు) నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కొండేపి సి.ఐ జి. సోమశేఖర్, కొండేపి, పొన్నలూరు ఎస్సైలు ప్రేమ్ కుమార్,పి.సత్యనారాయణ మరియు వారి సిబ్బందితో కలిసి 30 మంది పోలీసులతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ప్రజల భద్రతను కాపాడటం & గంజాయి కోసం తనిఖీ, బెల్టు షాపులు నిర్వహణ అరికట్టడం మరియు నేరాలను అదుపు చేయడమే లక్ష్యంగా ఈ తనిఖీలు జరిగాయి.కాలనీలోని ప్రతి ఇంటిని మరియు అనుమానిత వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు (Documents) లేని 28 ద్విచక్ర వాహనాలను (Bikes) మరియు 5 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 33 వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, కొత్త చట్టాలు, మహిళలపై నేరాలు మరియు వాటి శిక్షల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.కొండేపి సిఐ జి. సోమశేఖర్ మాట్లాడుతూ, ప్రజలు తమ వాహనాలకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను ఎల్లప్పుడూ కలిగి ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు లేదా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గంజాయి విక్రయించడం మరియు సేవించేటు వంటి వ్యక్తుల గురించి సమాచారాన్ని కనుగొనడం, బెల్ట్ షాపుల నిర్వహణ అరికట్టడం, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *