తొలి శుభోదయం న్యూస్ :-

జిల్లా కేంద్రంలో ఈ నెల 8 నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పేర్కొన్నారు.శుక్రవారం డి ఆర్ ఓ, ఆర్ డి ఓ లు, మున్సిపల్ కమిషనర్లు డిఆర్డీఏ, మెప్మా,ఐ సి డి ఎస్ పి డి లు వివిధ జిల్లా శాఖల అధికారులతో ఈ నెల 8 న జిల్లా కేంద్రం తో పాటుగా నియోజకవర్గాలలో నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లు పై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఈ నెల 8 న నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే కార్యక్రమానికి 3 వేల మంది మహిళలు పాల్గొనున్నారని తెలిపారు .జిల్లా కేంద్రం తో పాటుగా నియోజకవర్గాలలో మహిళ దినోత్సవం కార్యక్రమాలు నిర్వహించాలని నియోజకవర్గాల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రం లో నిర్వహించే కార్యక్రమానికి సంబంధించి మినిట్స్ మినిట్స్ తయ్యారు చేయాలని ఐ సి డి ఎస్ పిడిని ఆదేశించారు.మెప్మా, డిఆర్డీఏ,ఐ సి డి ఎస్ పిడీలు మూడు వేల మంది మహిళలను సమకూర్చలని ఆదేశించారు. స్త్రీ శక్తి మహిళ యాప్,మహిళ పోలీస్,డి డిఆర్డీఏ, మెప్మా, స్టాల్స్ ఏర్పాటు చేయాలని,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని డి యం & హెచ్ ఓ ను ఆదేశించారు.డిఆర్డీఏ మెప్మా ద్వారా మెగా చెక్కును పంపిణీ చేయాలని పీడీలను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి లో నిర్వహించే ప్రోగ్రాం లో ముఖ్యమంత్రి పాల్గొనున్న కార్యక్రమం లైవ్ ఉంటుందని తెలిపారు. జిల్లాలోని యం పి,ఎమ్మెల్సీ లు,ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని తెలిపారు.మహిళ పారిశ్రామిక వేత్తలను సన్మానించడానికి, వారి విజయ గాధలను వారే వివరించేలా ఏర్పాట్లను చేయాలని డి.ఆర్.డి.ఏ పి.డి కు సూచించారు. అలాగే డి.ఆర్.డి.ఏ, మెప్మా, సంక్షేమ శాఖలు, పరిశ్రమల శాఖ, పోలీస్, శాఖల ద్వారా స్టాల్స్ ను ఈఓటు చేయాలని, ప్రత్యేకంగా మహిళలకు అందించే పథకాలకు సంబంధించిన అసెట్స్ పంపిణీకి సిద్ధం చేయాలని సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *