తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-

జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ పెద్దలు ప్రజలు సమాచార ప్రసార మాధ్యమాలు, పర్యాటక, మారిటైమ్ బోర్డ్,రెవెన్యూ, పోలీస్, పంచాయితీ, వైద్య ఆరోగ్య,గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ ఇతర శాఖల సమన్వయం సహకారం ప్రైడ్ మీడియా నిర్వహణ తో 2026 బీచ్ ఫెస్టివల్ ( పర్యాటక కార్పొరేషన్, మారిటైమ్ బోర్డ్ సంయుక్తంగా చేపట్టిన) ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల తీర ప్రాంతంలో రెండురోజులపాటు విజయవంతంగా ముగిసింది. ఊహకి అందని అంత గొప్పగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకించి తీర ప్రాంత గ్రామాల ప్రజలకు ఆహ్లాదాన్ని వినోదాన్ని సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేందుకు చేసిన ప్రయత్నం విజయవంతం కావడం తో ప్రభుత్వ పెద్దలు, జిల్లా యంత్రాంగం, ప్రత్యేకించి జిల్లా పోలీస్ వ్యవస్థ ఊపిరి పీల్చుకుంది. గత రెండు వారాలుగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర మారిటైమ్ బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్యనారాయణ ( సత్య ), రాష్ట్ర పర్యాటక బోర్డు చైర్మన్ డా.నూకసాని బాలాజీ, జిల్లా కలెక్టర్ రాజ బాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు, చేపట్టిన కార్యక్రమం విజయవంతం తమ పంతం అన్న రీతిలో జిల్లా తో పాటు కొండలు నియోజక వర్గం పాకల బీచ్ ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా సన్వయానికి ప్రాధాన్యత ఇచ్చి బీచ్ ఫెస్టివల్ విజయవంతం చేయడం తో జిల్లా ప్రజలు, ప్రత్యేకించి కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు, జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు.
