తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కందుకూరు ఏపీఎం టి. సురేష్ పొదుపు మహిళలకు సూచించారు. వెలుగు కార్యాలయంలో మండల స్థాయి పొదుపు కార్యకర్తలకు సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పి ఎం ఈ జి పి పి ఎం జి వై తదితర పరిక పథకాలు మహిళా అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు .సిసి అనిత మాట్లాడుతూ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ పథకం వల్ల కలిగే లాభాలను వివరించారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిఆర్పి బాలచంద్ర మాట్లాడుతూ పరిశ్రమ స్థాపించడానికి ఈ రంగంలో 35 శాతం రాయితీతో కూడిన రుణం అందిస్తామన్నారు లబ్ధిదారుడి వ్యాపార అభివృద్ధికి ఆర్థిక తోడ్పాటు కల్పిస్తామని సూచించారు సాంకేతిక శిక్షణ మార్కెటింగ్ సహాయం తదితర అంశాలు ద్వారా లాభం పొందవచ్చు అని ఆయన వివరించారు .ఈ కార్యక్రమంలో సిసి శ్రీకాంత్ దేవిక, సిబ్బంది పద్మజ, రజనీ, తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *